భారతదేశం, డిసెంబర్ 18 -- తమిళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన 'మిడిల్ క్లాస్' (Middle Class) సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. మునిష్‌కాంత్, విజయలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా డిసెంబర్ 24న జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతి జీవుల కష్టాలు, ఈఎంఐల గోల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

నవంబర్‌ 21న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన తమిళ కామెడీ డ్రామా 'మిడిల్ క్లాస్'. నెల రోజుల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 24 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

కిషోర్ ఎం రామలింగం దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి దగ్గరగా ఉంటుం...