భారతదేశం, డిసెంబర్ 31 -- కొత్త సంవత్సరానికి ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. 2025కు గ్రాండ్‌గా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరి రోజున (డిసెంబర్ 31) ఓటీటీలో నాలుగు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని అలరించిన స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things 5 Finale) ఓటీటీ సిరీస్ నేటితో ముగియనుంది. హాకిన్స్ పట్టణంపై వెక్నా చేస్తున్న దాడికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఎలెవన్, ఆమె గ్యాంగ్ సిద్ధమయ్యారు.

సుమారు రెండు గంటల నిడివి గల ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ 'చాప్టర్ ఎయిట్: ద రైట్‌సైడ్ అప్' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో అద్భుతమై...