భారతదేశం, మే 12 -- నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా బాగా హైప్ క్రియేట్ చేసింది. యాక్షన్, తల్లీకొడుకుల సెంటిమెంట్‍తో ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంది. దీంతో మంచి అంచనాలతో ఏప్రిల్ 18న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ డిజాస్టర్ అయింది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఇక ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. ఈ వారమే రానుందని సమాచారం చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలివే..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. రిలీజ్‍కు ముందే డీల్ జరిగింది. ఈ సినిమాను ఇండియాలో ఈ మే మూడో వారంలోనే స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని ప్రైమ్ వీడియో భావిస్తోందట. డేట్‍పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

అమెజాన్ ప్...