భారతదేశం, మార్చి 8 -- చైనాలో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు వైరల్​గా మారింది! ఓ మహిళ కొన్ని నెలల పాటు ఏకంగా 36మందిని డేట్​ చేసింది. పెళ్లి చేసుకుందామని చెప్పి, వారి చేత ఇళ్లు కొనిపించింది. ఆ తర్వాత మాయమైపోయింది. వారిలో చాలా మంది ఇప్పుడు హోం లోన్​లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు! అసలేం జరిగిందంటే..

చైనాలోని షెన్​హెన్​ అనే ప్రాంతానికి చెందిన అటాఓ (పేరు మార్చడం జరిగింది).. ఆన్​లైన్​ డేటింగ్​ యాప్​లో గతేడాది మార్చ్​లో లియు జియా అనే మహిళను కలిశాడు. తన వయస్సు 30ఏళ్లు అని, తాను హునన్​ రాష్ట్రానికి చెందిన మహిళ అని, కానీ ఉద్యోగం రిత్యా షెన్​హెన్​లో పనిచేస్తున్నట్టు ఆ వ్యక్తికి చెప్పింది లియు జియా. కొన్ని రోజుల్లోనే వారిద్దరు ప్రేమలో పడ్డాడు. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇక్కడే అటాఓకి లియు ట్విస్ట్​ ఇచ్చింది! పెళ్లి ప్రతిపాదన...