భారతదేశం, ఫిబ్రవరి 24 -- సాధారణంగా ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే పాతవి కనుమరుగవుతాయి. కానీ 1959లో పుట్టిన 'కోబాల్' (COBOL) అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. అయితే, నిన్న (ఫిబ్రవరి 23) ఆంథ్రోపిక్ సంస్థ తన బ్లాగ్‌లో రాసిన కొన్ని అంశాలు ఐబీఎమ్ సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా వణికించాయి. ఐబీఎమ్ షేర్లు గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 13.2% పడిపోయాయి.

COBOL అంటే 'కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్'. బ్యాంకింగ్, ఫైనాన్స్, ప్రభుత్వ రంగాలు తమ డేటాను ప్రాసెస్ చేయడానికి దీనిని వాడతాయి.

ఐబీఎమ్ వంటి కంపెనీలు పాత కోబాల్ సిస్టమ్స్‌ను ఆధునీకరించడానికి ఏళ్ల తరబడి కన్సల్టెంట్లను నియమించి, వేల కోట్లు ఖర్చు చేసేవి. కానీ ఆంథ్రోపిక్ తన బ్లాగ్‌లో సంచలనమైన విషయాలు చెప్పింది. "గతంలో కోబాల్ సిస్టమ్స్‌ను మార్చడానికి...