భారతదేశం, ఏప్రిల్ 30 -- బుధ‌వారం రోజు రెండు తెలుగు సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వ‌చ్చాయి. రుద్ర‌వీణ‌తో పాటు స‌ముద్రుడు సినిమాలు ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా రిలీజ‌య్యాయి. ఈ రెండు సినిమాలు గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యాయి. ఆరు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చాయి.

స‌ముద్రుడు మూవీలో ర‌మాకాంత్‌, అవంతిక‌, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా న‌టించారు. న‌గేష్ నార‌దాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో సుమ‌న్‌, స‌మ్మెట గాంధీ, జ‌బ‌ర్ధ‌స్థ్ శేషు కీల‌క పాత్ర‌లు పోషించారు. చేప‌ల వృత్తి జీవ‌నాధారంగా బ‌తికే మ‌త్య్స‌కారులు ద‌ళారుల కార‌ణంగా ఎలా దోపిడీల‌కు గురువుతున్నార‌నే సందేశానికి యాక్ష‌న్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు ఈ మూవీని రూపొందించాడు.

గంగ స‌ముద్రంపై చేపలు ప‌ట్ట‌గా వ‌చ్చే డ‌బ్బుల‌తో జ‌ల్సాలు చేస్తుంటాడు. ద...