భారతదేశం, జూలై 27 -- సెప్టెంబర్​లో లాంచ్​ అయ్యే ఐఫోన్​ 17 సిరీస్​ కోసం యాపిల్​ లవర్స్​ ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా, ఈసారి ఐఫోన్​ 17 ప్రో మ్యాక్స్​ మోడల్​పై ఆసక్తి ఎక్కువ కనిపిస్తోంది. ఈ కొత్త స్మార్ట్​ఫోన్ అత్యాధునిక ఫీచర్లు, కొత్తగా రూపొందించిన బ్యాటరీ, మెరుగైన ఇమేజింగ్ సామర్థ్యాలతో వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 17 ప్రో మ్యాక్స్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

పలు లీకుల ప్రకారం, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ యాపిల్ ఐఫోన్‌లలోనే అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది! ఇది సుమారు 5,000 ఎంఏహెచ్​ సామర్థ్యంతో వస్తుందని అంచనా. గత సంవత్సరం ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో ఉన్న 4,676 ఎంఏహెచ్​ బ్యాటరీతో పోలిస్తే ఇది గణనీయంగా పెద్దది. రెండర్ చిత్రాల ప్రకారం.. ఈ పెద్ద బ్యాటరీని అమర్చడానికి స్మార్ట్​ఫోన్ మందం 8.25 ఎంఎం నుంచి 8.725 ఎంఎంక...