భారతదేశం, అక్టోబర్ 5 -- ప్రపంచ మార్కెట్‌లో అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా టెక్ దిగ్గజాలైన యాపిల్, షావోమీ తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు - ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, షావోమీ 17 ప్రో మ్యాక్స్​ని విడుదల చేశాయి. అధునాతన ఫీచర్లు, అద్భుతమైన కెమెరా, రాజీ పడకుండా సొగసైన డిజైన్‌ను కోరుకునే హై-ఎండ్ వినియోగదారులను ఆకట్టుకోవాలని ఈ రెండు కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ యాపిల్​కి చెందిన సరికొత్త ఏ19 ప్రో చిప్, ఐఓఎస్ 26, రీడిజైన్డ్​ ఛాసిస్‌తో వస్తుంది. మరోవైపు షావోమీ యాపిల్ తాజా మోడల్‌ను నేరుగా సవాలు చేసే విధంగా కొత్త ఫీచర్లు, డిస్‌ప్లే అప్​గ్రేడ్స్, అదనపు కార్యాచరణపై దృష్టి పెట్టింది.

ఈ సంవత్సరం, షావోమీ ఏకంగా 16 సిరీస్‌ను దాటవేసి, నేరుగా ఐఫోన్ 17 సిరీస్‌కు పోటీ ఇవ్వడానికి రంగంలోకి దిగింది! ఈ రెండు ఫ్...