భారతదేశం, ఏప్రిల్ 23 -- ఎలక్ట్రిక్ వాహన రంగంపై నమ్మకం ఉంటే ఏథర్ ఎనర్జీ ఐపీఓపై ఓ కన్నేసి ఉంచండి. ఒక్కో షేరు ధరను రూ.304 నుంచి రూ.321గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే సమయంలో యాంకర్ ఇన్వెస్టర్లకు ఏప్రిల్ 25న షేర్లు లభిస్తాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఏథర్ షేర్ల ధర (జీఎంపీ) ఐపీఓ ధర కంటే 15-20 శాతం ఎక్కువగా ఉంది.

లాట్ సైజు చూస్తే.. 1 లాట్‌కు 46 షేర్లు. అంటే కనీసం 46 షేర్లను కొనుగోలు చేయాలి. పెద్ద ఇన్వెస్టర్లకు (క్యూఐబీలు) 75 శాతం, హెచ్ఎన్ఐలు/ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, చిన్న ఇన్వెస్టర్లకు (రిటైల్) 10 శాతం వాటాగా నిర్ణయించారు. ఉద్యోగులు రూ.30 తగ్గింపుతో షేర్లను కొనుగోలు చేయవచ్చు.

షేర్లను ఎవరు అందుకున్నారో, ఎవరు అందుకోలేదో మే 2న ఇన్వెస్టర్లకు తెలుస్తుంది. షేర్లు కేటాయిం...