భారతదేశం, ఫిబ్రవరి 18 -- స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఐటీ సేవల సంస్థ 'బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సోల్యూషన్స్' (Blue Cloud Softech Solutions) షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో పరుగులు పెట్టాయి. బీఎస్‌ఈ (BSE)లో ఈ స్మాల్-క్యాప్ స్టాక్ ఏకంగా 6.48 శాతం లాభపడి రూ. 24.45 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. కంపెనీ చేపట్టిన సరికొత్త వ్యూహాత్మక మార్పులే ఈ పెరుగుదలకు ఊతమిచ్చాయి.

కేంద్ర టెలికాం శాఖ (DoT) నుంచి 'నేషనల్ ఏరియా సర్వీస్' కోసం కేటగిరీ-'ఏ' యూనిఫైడ్ లైసెన్స్‌ (VNO) పొందినట్లు బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ ప్రకటించింది. ఈ లైసెన్స్ దక్కడం కంపెనీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

దీని ద్వారా కంపెనీ కేవలం ఇంటర్నెట్ సేవలు అందించడమే కాకుండా, తన ప్రధాన లక్ష్యమైన ఏఐ-నేటివ్ డేటా సెంటర్లు ...