భారతదేశం, జనవరి 13 -- తెలంగాణ ఐటీ రంగం వేగంగా దూసుకుపోతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఐటీ రంగానికి కేరాఫ్‌గా మారడంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి సఫలమవుతోంది. తెలంగాణ సంవత్సరానికి రూ.3 లక్షల కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు చేస్తోందని గణంకాలు చెప్తే... అదేంటో, ఎలా జరుగుతుందో అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు. కానీ ఆ గణాంకాల వెనుక ఒక మనిషి జీవితం ఉంటుంది. ఒక కొత్త ఉద్యోగం, ఒక కొత్త ఇల్లు, ఒక కుటుంబానికి భరోసా... ఇవన్నీ సంఖ్యలుగా కనిపించే ఐటీ ఎగుమతులు, పెట్టుబడులు, వృద్ధి శాతాల వెనుక దాగి ఉన్న నిజమైన లెక్కలు! గత రెండేళ్లుగా తెలంగాణ ఐటీ రంగం వేగంగా ముందుకు సాగుతున్న తీరుకు ఇవి సాక్ష్యాలు! ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ జయకేతనం కాదు, ఇది మారుతున్న ప్రపంచానికి సరిపోయేలా ఒక రాష్ట్రం తన భవిష్...