భారతదేశం, జూలై 26 -- భారత దేశ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోని రూ.20వేల బడ్జెట్​ సెగ్మెంట్​లో విపరీతమైన పోటీ నెలకొంది. చాలా ఆప్షన్స్​ ఉండేసరికి ఏ మొబైల్​ కొంటే బెస్ట్​? అని కస్టమర్లు తేల్చుకోలేకపోతుంటారు. అయితే ఈ సబ్​-20,000 సెగ్మెంటలో ఐక్యూ జెడ్​10ఆర్​, సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రోలకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఐక్యూ జూలై 24న విడుదల చేసిన సరికొత్త జెడ్​10ఆర్ స్మార్ట్​ఫోన్​​.. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 4ఎన్​ఎం చిప్‌సెట్. సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రోలో ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో కూడా 4ఎన్​ఎం చిప్‌సెట్‌ ఉంది. ఈ రెండూ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌లు, అదే జీపీయూతో వస్తాయి. రెండు ఫోన్‌లు 8జీబీ ర్యామ్​తో ప్రారంభమవుతాయి. అయితే, ఐక్యూ జె...