భారతదేశం, ఫిబ్రవరి 12 -- కోర్టులో కేసు విచారణలో ఉన్న స్థలంలో నిర్మాణాన్ని అక్రమంటూ ఎలా కూల్చుతారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. ఏ అధికారంతో ఆ నిర్మాణాన్ని తొలగించారని అడిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారని, ఆ అధికారం హైడ్రాకు లేదని స్పష్టం చేసింది.

ఇటీవల రంగారెడ్డి జిల్లా నార్సింగ్గి వద్ద కంచె వేసిన భూమిపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పలు ప్లాట్లకు ఉన్న కాంపౌండ్‌ను కూల్చివేసి కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ.. గోర్ల రాహుల్ యాదవ్‌తోపాటుగా మరికొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ స్థలానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌లో పిటిషనర్ల హక్కులు ధ్రువీకరిస్తూ.. కింది కోర్టు తీర్పు ఇచ్చింది పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై అధికారులు దాఖలు చేసిన అప్పీలు పెండింగ్‌లో ఉందన్నారు. ఎలాంటి నోటీసులూ లేకుండా కాం...