Hyderabad, ఏప్రిల్ 27 -- నీటిపారుదల శాఖ గజ్వేల్‌ ఈఎన్‌సీ భుక్యా హరిరామ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ టీమ్ రంగంలోకి దిగింది. శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. ఆ తర్వాత హరి రామ్ ను అరెస్ట్ చేసినట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

హరిరామ్‌ ఆస్తులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఏసీబీ పేర్కొంది. అక్రమాస్తుల వాస్తవ విలువ భారీగా ఉంటుందని తెలిపింది. ఏసీబీ తెలిపిన కొన్ని వివరాల ప్రకారం. హరిరామ్ నివాసంతో ఆయన బంధువులకు సంబంధంచిన 13 స్థలాల్లో సోదాలు నిర్వహించారు. విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు తేలింది.

విలువైన గృహాలు 2, విల్లాలు 2, ఓపెన్ ప్లాట్లు -2, నిర్మాణంలో ఉన్న భవంతి -1, ఓపెన్ ఫ్లాట్స్ 2 ఉన్నాయి. ఇక 28.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ఫార్మ్ హౌస్ కలిగిన 6 ఎకరాల మామిడి తోట, ఒక వాణిజ్...