భారతదేశం, ఏప్రిల్ 21 -- గుడ్​ ఫ్రైడే నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లకు శుక్రవారం సెలవు. ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి.బీఎస్​ఈ సెన్సెక్స్​ 1509 పాయింట్లు పెరిగి 78,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 414 పాయింట్లు వృద్ధిచెంది 23,852 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1172 పాయింట్లు పెరిగి 54,290 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,667.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,006.15 కోట్లు విలువ చేసే విక్రయించారు.

ఏప్రిల్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 19,971.65 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 21,117.868 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. ఏప్రిల్​ 21, సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష...