భారతదేశం, నవంబర్ 15 -- వాతావరణశాఖ మరో ముఖ్యమైన ప్రకటన చేసింది. నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో నవంబర్ 21 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉందని వెల్లడించింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రభావంతో ఈ నెల 24 నుంచి 27 వరకు కోస్తా,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానున్నట్లు తెలిపింది.రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇక అమరావతి వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం. ఇవాళ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.