భారతదేశం, ఏప్రిల్ 26 -- ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బార్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా తగ్గించింది. బార్ల లైసెన్స్ ఫీజును ఏడాదికి రూ.5 లక్షలుగా నిర్ణయించింది. అలాగే 3 స్టార్, ఆపై స్థాయి హోటళ్లలో బార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం తగ్గించింది.
పర్యాటకం, ఆతిథ్య రంగానికి ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 3 స్టార్, ఆపైస్థాయి హోటళ్లలో రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించింది. నాన్ రిఫండబుల్ ఛార్జీని రూ.20 లక్షలుగా నిర్ణయించింది. లైసెన్స్ ఫీజులు తగ్గించాలన్న హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
స్టార్ హోటళ్లు ఉన్నచోట బార్ లైసెన్స్‌ల జారీపై ఎలాంటి నియంత్రణ లేదని ఎక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.