భారతదేశం, ఏప్రిల్ 26 -- ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బార్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా తగ్గించింది. బార్ల లైసెన్స్ ఫీజును ఏడాదికి రూ.5 లక్షలుగా నిర్ణయించింది. అలాగే 3 స్టార్, ఆపై స్థాయి హోటళ్లలో బార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం తగ్గించింది.

పర్యాటకం, ఆతిథ్య రంగానికి ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 3 స్టార్‌, ఆపైస్థాయి హోటళ్లలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించింది. నాన్‌ రిఫండబుల్‌ ఛార్జీని రూ.20 లక్షలుగా నిర్ణయించింది. లైసెన్స్ ఫీజులు తగ్గించాలన్న హోటల్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

స్టార్ హోటళ్లు ఉన్నచోట బార్‌ లైసెన్స్‌ల జారీపై ఎలాంటి నియంత్రణ లేదని ఎక్...