భారతదేశం, మే 17 -- ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్ కేసులో సిట్‌ విచారణ వేగవంతం అయ్యింది. ఈ కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని సిట్‌ అధికారులు చెబుతున్నారు. ఈ ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్‌ రిపోర్ట్‌లో కోరారు సిట్‌ అధికారులు. ఈ సమయంలో ధనుంజయ రెడ్డి గురించి జోరుగా చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.

1.ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లెకు చెందిన ధనుంజయ రెడ్డి.. 1988లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ఆ పంచాయతీకి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్‌ కుటుంబానికి ధనుంజయ రెడ్డి నమ్మినబంటు అనే పేరుంది.

2.చెన్నముక్కల పల్లెకు సర్పంచిగా పనిచేస్తూనే.. డానిక్స్‌ సర్వీసుకు ఎంపికయ్యారు. ఢి...