Andhrapradesh,amaravati, మే 17 -- ఏపీ మెగా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గత నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా.. మే 15 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. అయితే ఈసారి ఈ మెగా డీఎస్సీకి 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లయ్ చేసుకున్నారు.
ఏపీలో డీఎస్సీ నిర్వహణ కోసం అభ్యర్థులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. 2024లో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైనా ఎన్నికల కోడ్ రావడంతో అది జరగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత నోటిఫికేషన్ రద్దు చేసింది. మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు ఏడాది కాలంగా డీఎస్సీ పరీక్ష నిర్వహణ కోసం లక్షలాది మంది పరీక్షలకు సిద్ధమవుతున్నారు. దీంతో 5 లక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.