Andhrapradesh, జూన్ 7 -- డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4 శాతం వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని నిర్ణయించింది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్స్) పరిధిలోని స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం అందించనున్నారు. ప్రస్తుతం స్తీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11 శాతం వడ్డీతో రుణాలిస్తున్నారు. ఈ కొత్త స్కీమ్ ను 'ఎన్టీఆర్ విద్యా సంకల్పం' పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పం నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.