Andhrapradesha,amaravati, మే 12 -- ఏపీ పాలిసెట్ - 2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫైనల్ కీ కూడా వచ్చేసింది. ఇక తుది ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితాలను మే మూడో వారంలో ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.
ఏపీ పాలిసెట్ - 2025 ఎగ్జామ్ ను ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించారు. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా పాలిటెక్నిక్ కళాశాలల్లోని వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్లు కల్పిస్తారు.
ఈ ఏడాది పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. ఇందుకు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన వెంటనే ప్రాథమిక కీని విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించారు. ఇటీవలే ఫైనల్ కీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.