భారతదేశం, మే 7 -- ఏపీ దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. వీటిలో డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలు ఉన్నాయి. మరో 200 వైదిక సిబ్బంది కొలువుల నియామకాలకు అంగీకారం తెలిపారు. కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు చేయనున్నారు.
ఏపీలో 23 ప్రధాన ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కార్యక్రమాలు చేపట్టాలని, దేవాలయ భూముల్లో శాఖాహార హోటళ్లకు మాత్రమే అనుమతించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.