Andhrapradesh, జూన్ 11 -- ఏపీ గ్రూప్ 1 ఫలితాలు వచ్చేశాయ్. ఈ మేరకు ఏపీపీఎస్సీ మంగళవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది. జూన్ 23 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు జరగనున్నట్లు తెలిపింది.
మొత్తం 81 గ్రూప్ -1 పోస్టులకు గతేడాది మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. ఇందుకు దాదాపు 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన వారి ఫలితాలను ఏపీపీఎస్సీ తాజాగా వెల్లడించారు. వీరికి జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.