భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలోని రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు పడే తిప్పలకు ఉపశమనం కలిగించేలా సరికొత్త సేవలను తీసుకొచ్చింది. ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసుకునేలా. రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలను ప్రవేశపెట్టింది. ఈ సేవలను రైతులు వినియోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ధాన్యం సేకరణ ప్రక్రియను సరళీకృతం చేయడానికి మరియు రైతులు ఇకపై సేకరణ కేంద్రాల వద్ద వేచి ఉండకుండా ఈ వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. వాట్సాప్ ఆధారంగా స్లాట్లు బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.

ధాన్యం కొనుగోలుకు వాట్సాప్ ఆధారంగా స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి రైతులు 7337359375 కు "హాయ్" అనే సందేశం పంపాలి. వెంటనే ఆర్టిఫిష...