భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీలో రేపు(మంగళవారం) 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు శ్రీకాకుళం జిల్లాలోని 4 మండలాలు, విజయనగరం జిల్లాలో 13 మండలాలు, మన్యం జిల్లాలో 11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం 12 మండలాల్లో తీవ్ర వడగాలులు, 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో 1 మండలం, విజయనగరం జిల్లాలో 8 మండలాలు, మన్యం జిల్లాలో 3 మండలాలు, అల్లూరి జిల్లాలో 1 మండలం, అనకాపల్లి జిల్లాలో 3 మండలాలు,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.