భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు.

'కేసు దర్యాప్తులో రాష్ట్రం వెలుపలి ఫోరెన్సిక్‌ నిపుణుల సాయం తీసుకోవాలి. ఎంపికైన అభ్యర్థుల జవాబుపత్రాలు భద్రంగా ఉన్నాయో.. లేదో.. నిర్ధారించాలి. జవాబు పత్రాలు తారుమారు చేశారా? చూడాలి.' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మూల్యాంకనంలో అక్రమాలను బయటపెట్టేందుకుగానూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయేలాని పేర్కొంది. అంతేకాదు రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోవాలని వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు...