భారతదేశం, నవంబర్ 20 -- ఏపీకీ మరో తుపాను ముప్పు ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందని, వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో ఏపీలో వర్షాలు పడనున్నాయి.

మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. దీనితో ఇవాళ.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రోజున కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరుతోపాటుగా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లోనూ వానలు పడనున్నాయి.

ఈ వాతావరణ ప్రభావంతో నంబర్ 22 నుంచి 25 వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ...