భారతదేశం, ఏప్రిల్ 16 -- ఎలాన్​ మస్క్​ ఎక్స్​ (ట్విట్టర్​) మాదిరిగా, ఎక్స్​కి పోటీగా ఓపెన్​ఏఐ నుంచి కొత్త సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాట్​ఫామ్​కి సంబంధించిన అంతర్గత ప్రోటోటైప్​పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేనప్పటికీ, చాట్​జీపీటీ ఇమేజ్-జనరేషన్ టూల్స్ చుట్టూ ఇది తిరుగుతుందని, రియల్​ టైమ్​ కంటెంట్​ షేరింగ్​తో సోషల్ ఫీడ్​ని కలిగి ఉంటుందని సమాచారం.

ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్​మన్ ఈ ప్రాజెక్టుపై బయటి వ్యక్తుల నుంచి వ్యక్తిగతంగా ఫీడ్​బ్యాక్ తీసుకుంటున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఓ నివేదిక తెలిపింది. సోషల్ నెట్​వర్క్​ స్టాండలోన్ యాప్​గా ప్రారంభమవుతుందా లేదా చాట్​జీపీటీ ప్లాట్​ఫామ్​లో విలీనం అవుతుందా అనేది అస్పష్టంగా ఉంది.

సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ని ప్రారంభించడం వల్ల ఎలాన్ మస్క్​తో ఆల్ట్​మన్​కు ఉన్న దీర్...