భారతదేశం, జూలై 12 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్​ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదికను విమాన ఏఏఐబీ(ఎయిర్​క్రాఫ్ట్​ యాక్సిడెంట్​ ఇన్వెస్టిగేషన్​ బ్యూరో) తాజాగా విడుదల చేసింది. ఈ నివేదికలో విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లు సంచలనాత్మక వివరాలను వెల్లడించాయి. టేకాఫ్ సమయంలో రెండు ఇంజిన్‌లకు ఇంధనం కటాఫ్​ అయిపోయిందని ఒక పైలట్ గుర్తించగా, తాను ఆ పని చేయలేదని మరో పైలట్​ చెప్పడం రికార్డింగ్‌లలో స్పష్టంగా వినిపించింది.

ఎయిర్​ ఇండియా విమాన ప్రమాదంలో 260మందికిపైగా మరణించారు. ఈ దుర్ఘటనపై ప్రచురించిన 15 పేజీల నివేదిక.. దశాబ్దాల కాలంలో భారతదేశం చూసిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం చివరి క్షణాల గురించి మొదటి అధికారిక వివరాలను సూచిస్తుంది. ఇది ఏకకాలంలో రెండు ఇంజిన్‌లు పనిచేయకపోవడానికి గల కారణాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తు...