భారతదేశం, మే 18 -- నగర రియల్ ఎస్టేట్ రంగంలో దేశీయ కొనుగోలుదారుల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుండి కూడా డిమాండ్ పెరుగుతోందని క్రెడాయ్ (కాన్ఫిడరేషన్​ ఆఫ్​ రియల్​ ఎస్టేట్​ డెవలపర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా) బెంగళూరు అధ్యక్షుడు జాయ్ద్ నోమన్ తెలిపారు. డాలర్ విలువ బలపడటం, అమెరికాలో కొనసాగుతున్న వీసా సవాళ్లు ఇందుకు కారణం అని వివరించారు. ఈ మేరకు హెచ్​టీతో జరిగిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

డాలర్ బలపడటం వల్ల భారతీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఎన్ఆర్ఐలకు, ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం అణ్వేషిస్తున్న వారికి మరింత ఆకర్షణీయంగా మారాయని జాయ్ద్​ నోమన్​ అన్నారు.

"ఇటీవలి సంవత్సరాల్లో, ఎన్ఆర్ఐ భాగస్వామ్యంలో గణనీయమైన పెరుగుదలను చూశాము. డాలర్ బలపడటం వల్ల భారతీయ పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అవకాశ...