భారతదేశం, జూలై 1 -- టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన 'వార్ 2' సినిమాకు ఓ రేంజ్‍లో క్రేజ్ ఉంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఈ మూవీతోనే బాలీవుడ్‍‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాకు తెలుగులోనూ హైప్ బాగా ఉంది. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ తరుణంలో వార్ 2 మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఆ వివరాలు బయటికి వచ్చాయి.

వార్ 2 సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు. ఏకంగా రూ.80కోట్ల భారీ ధరకు ఈ మూవీ తెలుగు రైట్స్‌ను సితార సంస్థ దక్కించుకుందని సమాచారం బయటికి వచ్చింది. దీంతో వార్ 2 తెలుగు వెర్షన్ డీల్‍పై నెలకొన్న ఉత్కంఠకు తెర...