భారతదేశం, జూలై 15 -- ఏపీ మద్యం కేసుకు సంబంధించి రోజుకో అప్డేట్ వస్తూనే ఉంది. ఈ కేసు సంచలనంగా మారింది. ఇందులో కీలక వ్యక్తులు ఉండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు.

తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ కేసులో మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే విషయంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

వైసీపీ ప్రభుత్వ సమయంలో మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థను మాన్యువల్ పద్ధతిలోకి తీసుకువచ్చేందుకు మిథున్ రె...