భారతదేశం, సెప్టెంబర్ 2 -- తన కింద పనిచేసే ఉద్యోగినితో ఉన్న రొమాంటిక్ రిలేషన్‌షిప్‌ని బయటపెట్టని కారణంగా, దిగ్గజ నెస్లే సంస్థ తన ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) లారెంట్ ఫ్రీక్స్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నెస్లే వ్యాపార నిబంధనావళిని (కోడ్ ఆఫ్ బిజినెస్ కండక్ట్) ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
కిట్‌క్యాట్, నెస్కాఫే వంటి ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ, కొన్ని నెలల క్రితం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. నెస్లే ఛైర్మన్ పాల్ బల్క్, స్వతంత్ర డైరెక్టర్ పాబ్లో ఇస్లా ఈ విచారణకు నాయకత్వం వహించారు.
"ఇదో తప్పనిసరి నిర్ణయం. నెస్లే విలువలు, పాలన మా కంపెనీకి బలమైన పునాదులు. లారెంట్ అందించిన సేవలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను," అని బల్క్ ఒక ప్రకటనలో తెలిపారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.