భారతదేశం, సెప్టెంబర్ 2 -- తన కింద పనిచేసే ఉద్యోగినితో ఉన్న రొమాంటిక్​ రిలేషన్​షిప్​ని బయటపెట్టని కారణంగా, దిగ్గజ నెస్లే సంస్థ తన ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) లారెంట్ ఫ్రీక్స్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నెస్లే వ్యాపార నిబంధనావళిని (కోడ్ ఆఫ్ బిజినెస్ కండక్ట్) ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

కిట్‌క్యాట్, నెస్కాఫే వంటి ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ, కొన్ని నెలల క్రితం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. నెస్లే ఛైర్మన్ పాల్ బల్క్, స్వతంత్ర డైరెక్టర్ పాబ్లో ఇస్లా ఈ విచారణకు నాయకత్వం వహించారు.

"ఇదో తప్పనిసరి నిర్ణయం. నెస్లే విలువలు, పాలన మా కంపెనీకి బలమైన పునాదులు. లారెంట్ అందించిన సేవలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను," అని బల్క్ ఒక ప్రకటనలో తెలిపారు....