Hyderabad, మే 3 -- తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి ప్రయోగాత్మక చిత్రానికి గౌరవం దక్కింది. హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి' చిత్రం దాసరి ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ కథా చిత్రంగా అవార్డు సాధించింది. దీంతో మరొకసారి కథా ప్రధానమున్న సినిమాలకు గౌరవం తీసుకువచ్చింది.
ఈ శబరి చిత్రాన్ని ఎన్ఆర్ఐ అయిన మహేంద్ర నాథ్ కూండ్ల తన తొలి ప్రయత్నంగా నిర్మించటం విశేషం. తొలి సినిమాకే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎన్నుకొని, ఒక హృద్యమైన, భావోద్వేగాలు కలగలిపిన కథను అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కించటం ఆయనకు సినిమా పట్ల ఉన్న నిబద్దతను స్పష్టంగా చాటింది.
అనిల్ క్యాట్జ్ అనే నూతన దర్శకుడు శబరి సినిమాను తెరకెక్కించారు. ఒక తల్లి తన బిడ్డను రక్షించేందుకు చేసిన ఒంటరి పోరాటాన్ని మిశ్రమ భావోద్వేగాలతో కూడిన రీతిలో హృద్యంగా ఆవిష్కరించారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.