భారతదేశం, ఫిబ్రవరి 19 -- దేశంలోని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రకటిస్తున్న 'ఉచితాల సంస్కృతి' (Freebie Culture)పై సుప్రీంకోర్టు గురువారం నిప్పులు చెరిగింది. ఇలాంటి ధోరణి దేశ ఆర్థిక పురోగతికి గొడ్డలి పెట్టు వంటిదని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. తక్షణమే ఈ విధానాలపై పునఃసమీక్ష జరపాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది.

తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 'తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్' (Tangedco) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రతిపాదనపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిరుపేదలకు సాయం చేయడం రాష్ట్రాల బాధ్యత అని అంగీకరిస్తూనే, చెల్లించే స్తోమత ఉన్నవారికి కూడా ఉచితాలు పంచడం ఏంటని ప్రశ్...