భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఆయన మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హరియాణాకు చెందిన ఈ అధికారి పెళ్లి ఇటీవలే జరిగింది. ఆయన మరణం యావత్ ప్రాంతాన్ని శోకసంద్రంలో ముంచింది. వినయ్ నర్వాల్ తాత హవా సింగ్ ప్రభుత్వానికి ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి రాక్షసులను కఠినంగా శిక్షించాలని, ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ప్రభుత్వాన్ని చేతులు జోడించి కోరుతున్నామన్నారు.

ఏప్రిల్ 16న లెఫ్టినెంట్ నర్వాల్ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీ నిర్వహించగా ఆయన కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. విహారయాత్ర నిమిత్తం కొచ్చి నుంచి కశ్మీర్ చేరుకున్న నర్వాల్ తన భార్యతో కలిసి పహల్గామ్ సందర్శనకు వెళ్...