Hyderabad, సెప్టెంబర్ 12 -- ఓటీటీల్లోకి ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చేశాయి. అయితే ఈ వీకెండ్ వీటిలో మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో ఇక్కడ తెలుసుకోండి. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ఆహా తమిళంలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు. మరి ఆ మూవీస్, సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.

గత వారంలాగే ఈవారం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో మాంచి దూకుడు మీద ఉంది. ఎందుకంటే ఈ ఓటీటీలో ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో కూలీ కూడా ఉంది. రజనీకాంత్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

ఇక ఇది కాకుండా అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా కూడా శుక్రవారమే (సెప్టెంబర్ 12...