Hyderabad, సెప్టెంబర్ 27 -- నిరంతరం వినోదభరితమైన ఫిక్షన్​, నాన్​ ఫిక్షన్​ షోలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ దసరాకి మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలను అందించేందుకు సిద్ధమైంది. ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 28న వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్‌​గా సూపర్​ హిట్​ సినిమా సింగిల్‌ను ప్రసారం చేయనుంది.

సింగిల్ సినిమాతోపాటు దసరా ప్రత్యేక కార్యక్రమం 'దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా'ను ప్రసారం చేయనుంది జీ తెలుగు. యంగ్ హీరో శ్రీవిష్ణు, బ్యూటిపుల్ హీరోయిన్స్ కేతికా శర్మ, ఇవానా నటించిన సింగిల్​ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో టీవీ ప్రీమియర్ కానుంది.

అలాగే, గడసరి అత్తలు- సొగసరి కోడళ్ల సందడితో సాగే 'దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా' కార్యక్రమం సెప్టెంబర్ 28న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ వీకెండ్‌లో జీ తెలుగు అభిమానులకు...