భారతదేశం, ఆగస్టు 3 -- ఈ వారం స్టాక్ మార్కెట్‌లో సుమారు 10 కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. ఓ వైపు స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఐపీఓలు మాత్రం సందడి చేయనున్నాయి. ఈ వారం ఎన్ఎస్డీఎల్, లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ వంటి కంపెనీల లిస్టింగ్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీల గురించి తెలుసుకుందాం..

1.హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు ఉంటుంది. రూ.65 నుంచి రూ.70 వరకు ధరను కంపెనీ నిర్ణయించింది.

2. జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ ఆగస్టు 7 నుంచి ఆగస్టు 11 వరకు ఉంటుంది. ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

3. ఎసెక్స్ మెరైన్ కంపెనీ రూ.54 ధరను నిర్ణయించింది. ఆగస్టు 4న ఇష్యూ ప్రారంభం కానుంది. ఆగస్టు 6 వరకు కంపెనీ ఐపీఓ కొనసాగనుంది.

4. బీఎల్టీ లాజిస్టిక్స్ ఐపీఓ ఒక్కో షేరు ధరను రూ.71 నుంచి రూ.75గా కంపెనీ నిర్ణయించింది. ఆగస్టు 4న కంపెనీ ...