భారతదేశం, డిసెంబర్ 20 -- ప్రతి వారం ఓటీటీలో సందడి కొనసాగుతూనే ఉంటుంది. ఈ వారం కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో తెలుగు చిత్రాల వాటా ఎక్కువే. అయితే ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాల్లో ఈ నాలుగు స్పెషల్ గా కనిపిస్తున్నాయి. ఇందులో హారర్ థ్రిల్లర్ నుంచి కామెడీ వరకూ వివిధ రకాల జోనర్లు ఉన్నాయి.

విలేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి. ఇది డిసెంబర్ 18న ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. థియేటర్లో మంచి టాక్ అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. తన కూతురును గవర్నమెంట్ ఎంప్లాయ్ కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు ఓ తండ్రి. కానీ ఆ కూతురు మరో అబ్బాయిని లవ్ చేస్తుంది. అతణ్ని పెళ్లి చేసుకోవడం కోసం ముందే ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ సినిమాలో అఖిల్, తేజస్వి, చైతు జొన్నలగడ్డ తదితరులు నటించారు. ...