భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఈ వారం ఓటీటీలో అదిరే వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. క్రైమ్, మిస్టరీ, హారర్, రొమాంటిక్ థ్రిల్లర్లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. ఆ వెబ్ సిరీస్ లు ఏవి? ఏ ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఇక్కడ చూద్దాం.

వెడ్నెస్టే సీజన్ 2లో నెవర్‌మోర్ అకాడమీలో కొత్త భయంకరమైన రహస్యాలను ఎదుర్కొంటూ వెడ్నెస్డే అడమ్స్ (జెన్నా ఆర్టెగా) కథ కొనసాగుతోంది. టోన్ చీకటిగా ఉంటుంది. రహస్యాలు లోతుగా ఉంటాయి. సీజన్ 2 పార్ట్ 2లో పాప్ ఐకాన్ లేడీ గాగా కూడా నెవర్‌మోర్ అకాడమీలో ఒక రహస్య ఉపాధ్యాయురాలిగా తన వెడ్నెస్డే డెబ్యూ చేయనుంది. జెన్నా ఆర్టెగా, లేడీ గాగా, క్యాథరిన్ జెటా-జోన్స్, లూయిస్ గుజ్మాన్, ఎమ్మా మైయర్స్, జాయ్ సండే, ఐజాక్ ఆర్డోనెజ్, స్టీవ్ బస్సెమీ, జోవాన్నా లమ్లే తదితరులు నటించారు. ఇది సెప్టెంబర్ 3న ఓటీటీ రిలీజ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్...