భారతదేశం, ఫిబ్రవరి 16 -- స్టార్ మా ఛానెల్లో వచ్చే రెండు పాపులర్ సీరియల్స్ చిన్ని, నువ్వు లేక నేను లేను టెలికాస్ట్ అయ్యే టైమింగ్స్ మారిపోయినట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. ఈ విషయాన్ని స్టార్ మా సోమవారం (ఫిబ్రవరి 16) తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది. వీటి కొత్త టైమింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి.

స్టార్ మా తన ఛానెల్లో వచ్చే సీరియల్స్ టైమింగ్స్, ఎపిసోడ్ డ్యూరేషన్ విషయంలో కీలకమైన మార్పులు చేస్తోంది. ఇప్పటికే రెండు సీరియల్స్ ను అరగంటకు బదులుగా 45 నిమిషాలకు చేయగా.. ఇప్పుడు చిన్ని, నువ్వు లేక నేను లేను సీరియల్స్ టైమింగ్స్ మార్చేసింది.

సోమవారం (ఫిబ్రవరి 16) చిన్ని సీరియల్ సాయంత్రం 7 గంటలకు బదులుగా సాయంత్రం 6 గంటలకే టెలికాస్ట్ అవుతుంది. ఇక నువ్వు లేక నేను లేను రాత్రి 10 గంటలకు బదులుగా సాయంత్రం 7 గంటలకే వస్తుంది. ఈ రెండు సీరియల్స్ సోమవారం నుంచి శనివారం వర...