భారతదేశం, జూన్ 11 -- భిన్నమైన కథలే కాదు వాటిని తెరపై మరింత భిన్నంగా ప్రజెంట్ చేయడంలోనూ మలయాళం ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. అలా ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాయే పాడక్కలమ్ (Padakkalm). అంటే యుద్ధభూమి అని అర్థం. జియోహాట్‌స్టార్ ఓటీటీలో మంగళవారం (జూన్ 10) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూడండి.

మలయాళం మూవీ పాడక్కలమ్ మే 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ పేరుకు అర్థం యుద్ధభూమి. ఓ కాలేజీనే యుద్ధభూమిగా మార్చేసి ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ స్టూడెంట్ ఎలా ఓ వెరైటీ ఆటను ఎలా ఆడారన్నదే ఈ పాడక్కలమ్ మూవీ స్టోరీ. కేరళలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ కథ జరుగుతుంది.

కొన్ని వందల ఏళ్ల నాటి ఓ పాచికల ఆట ద్వారా ఎదుటి వ్యక్తులను తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రొఫెసర్ రంజీత్ (షరాఫుద్దీన్).. అతని ఆట కట్టించడానికి ...