Hyderabad, జూన్ 13 -- బ్లాక్‌బస్టర్ మలయాళం స్పోర్ట్స్ కామెడీ మూవీ ఆలప్పుళ జింఖానా(Alappuzha Gymkhana) బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. అయితే అప్పుడు అంతగా రాని రెస్పాన్స్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత వస్తోంది. ఈ మూవీ గురువారం (జూన్ 12) సాయంత్రం నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్ తోపాటు పలువురు ఇతర మలయాళ నటులు నటించిన స్పోర్ట్స్ కామెడీ మూవీ ఆలప్పుళ జింఖానా. ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టగానే సోషల్ మీడియాలో పలువురు ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు రాస్తున్నారు. ఈ మధ్య కాలంలో నా మోస్ట్ ఫేవరెట్ మూవీ అని ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. బేసిక్ స్టోరీతో వచ్చినా దానిని స్క్రీన్ పై చూపించిన తీరు అద్భుతమని, మ్యూజిక్ కూడా చాలా బాగుందని మరో వ్యక్తి అన్నారు.

మిగిలి...