Hyderabad, మే 13 -- మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఎన్ని చూసినా తనివి తీరడం లేదా? మరింత థ్రిల్ కోసం చూస్తున్నారా? అయితే ఆ ఇండస్ట్రీ స్టార్ యాక్టర్ జోజు జార్జ్, అంజలి నటించిన ఇరట్టా (Iratta) మూవీ మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ తోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ పోలీస్ స్టేషన్ లో శవమై కనిపించిన ఏఎస్సై మృతి విచారణ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

ఇరట్టా మూవీలో జోజు జార్జ్ డ్యుయల్ రోల్లో నటించాడు. రెండూ పోలీసు పాత్రలే. ఒకటి ఏఎస్సై వినోద్ కాగా.. మరొకటి డీవైఎస్పీ ప్రమోద్. తన అన్నను ఎంతగానో ద్వేషించే వినోద్ ఓ రోజు పోలీస్ స్టేషన్ లోనే గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి రక్తపు మడుగులో కనిపిస్తాడు.

అదే సమయానికి ఆ పోలీస్ స్టేషన్ కు మంత్రి రావాల్సి ఉండటంతో బయట పోలీసులు, మీడియా హడావిడి ఉంటుంది. అలాంటి సమయంలో పోలీస్ స్టేషన్ లో నుంచి గ...