భారతదేశం, ఫిబ్రవరి 19 -- తీర్థ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21వ తేదీ నుండి మే 21వ తేదీలలో 4 ప్రత్యేక ప్యాకేజీలను 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు' ద్వారా హైదరాబాద్ నుండి అందిస్తున్నట్టుగా ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి.వెంకటేష్ తెలిపారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరుకు ఈ యాత్రలో వెళ్లవచ్చు. మార్చి 21వ తేదీన ప్రారంభమై 28వ తేదీ వరకు ఉంట్టుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.14,700, 3ఏసీ ధర రూ.22,300, 2ఏసీ ధర రూ.28,700 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోల...