భారతదేశం, జనవరి 29 -- సాధారణంగా స్టార్ హీరోల సినిమాలను ఎవరూ వదులుకోరు. కానీ సల్మాన్ ఖాన్ నటించిన ఒక సినిమాను మాత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 30 మంది నటులు రిజెక్ట్ చేశారు. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇందులో సల్మాన్‌తో పాటు ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా నటించారు. అయితే వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించరు. ఈ సినిమాలో సల్మాన్ పాత్ర చివరికి చనిపోతుంది.

సల్మాన్ ఖాన్ ఓ ఎయిడ్స్ పేషెంట్ లా కనిపించిన ఆ సినిమా పేరు 'ఫిర్ మిలేంగే' (Phir Milenge). 2004లో బ్లాక్ బస్టర్ సినిమా 'ధూమ్' విడుదలైన సమయంలోనే ఇది కూడా విడుదలైంది. ఇందులో సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్‌లతో పాటు శిల్పా శెట్టి ప్రధాన పాత్రలో నటించింది.

'ఫిర్ మిలేంగే' సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక ఎయిడ్స్ రోగిగా నటించడం గమనార్హం. ఆ సమయంలో ఏ నటుడు కూడా ఎయిడ్స్ రోగి పాత్...