భారతదేశం, జనవరి 7 -- సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల నుంచి వెళ్లేవారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాయి. మహిళల కోసం స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ పథకం కింద పెద్ద సంఖ్యలో బస్సులను కేటాయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక సర్వీసుల నిర్వహణ ప్రణాళికలను సవరించింది.
ఏపీఎస్ఆర్టీసీ కార్యనిర్వాహక సంచాలకులు(ఆపరేషన్స్) ఎ. అప్పల రాజు ఒక ప్రకటనలో మాట్లాడారు. ఈ సంవత్సరం జిల్లా కేంద్రాలు, మండలం, పట్టణాలు, గ్రామాలకు ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ తన సంక్రాంతి 2026 వ్యూహంలో భాగంగా రాష్ట్రంలోని సర్వీసులకు ప్రాధాన్యత ఇవ్వాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.